schedule Thursday, May 21, 2026

యువత క్రీడల్లో రాణించాలి.. జాతీయ స్థాయిలో ప్రతిభను చూపాలి.... బుయ్యని శ్రీనివాస్ రెడ్డి 

calendar_today March 25, 2026
person Prajagalam News
యువత క్రీడల్లో రాణించాలి.. జాతీయ స్థాయిలో ప్రతిభను చూపాలి.... బుయ్యని శ్రీనివాస్ రెడ్డి 
తాండూర్: యువత  క్రీడలలో రాణించాలని క్రీడలతోనే మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం లభిస్తుందని జాతీయ స్థాయిలో ప్రతిభను చూపాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్.బి.ఓ.ఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.బషీరాబాద్ మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రేస్ నాయకులు అజయ్ ప్రసాద్ తండ్రి కిషన్ ప్రసాద్  జ్ఞాపకార్థం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొన్న విజేతలకు మరియు క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు మరియు బహుమతులు అందజేశారు, ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ యువకులు వాలీబాల్ లో అద్భుత ఆటతీరు కనబరిచారని, ఇలాగే క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలని,జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రతిభను ప్రదర్శించడానికి తాను ఎల్లవేళలా ప్రోత్సహిస్తానని అన్నారు. ఇలాంటి పోటీలు క్రీడాకారులలోని సృజనాత్మకతను వెలికి తీస్తాయని పేర్కొన్నారు.అజయ్ ప్రసాద్ తన తండ్రి  పేరిట ఈ క్రీడా నిర్వహించి యువకుల్లో క్రీడా స్ఫూర్తిని నింపారని,యువత స్మార్ట్ ఫోన్లు విడిచి క్రీడల వైపు ఆసక్తి చూపి శారీరిక ధారుడ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య వంతమైన జీవనాన్ని కొనసాగించాలి, భవిష్యత్తులో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించి గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాన్నీ వెలికి తీస్తామని  అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్ ప్రసాద్,  మండల నాయకులు,కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.