తాండూర్ లో వెయ్యేండ్ల సోమనాథ లింగాల దర్శనం
March 24, 2026
Prajagalam News
* పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు ప్రముఖులు భక్తులు
తాండూరు:
పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్‌లో ఆర్ట్ ఆఫ్ లింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ ఋషి దేవ వ్రతజీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో “1000 సంవత్సరాల సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం, పూజ సత్సంగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్బిఓఎల్ సీఈవో బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి దంపతులు జ్యోతిర్లింగాలను దర్శించుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో మంచి ఆలోచనలు పెంపొందిస్తాయని తెలిపారు. దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని తాండూర్ ప్రజలకు జ్యోతిర్లింగాల దర్శన భాగ్యాన్ని కలిగించిన స్వామీజీకి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ప్రముఖ హార్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఋషి దేవ వ్రతజీ మాట్లాడుతూ సోమనాథ జ్యోతిర్లింగ ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం… చరిత్రలో ఎన్నో దాడులను ఎదుర్కొందనీ. ముఖ్యంగా మహ్ముద్ గజ్నీ దాడి సమయంలో ఈ ఆలయం తీవ్రంగా ధ్వంసమైంది. వాటి అవశేషాలే ఈ జ్యోతిర్లింగాలని వీటికి 1000 సంవత్సరాలు పూర్తయిందని పేర్కొన్నారు.అయస్కాంత శక్తితో ఉన్న ఈ జ్యోతిర్లింగాలకు విశేష మహిమలు ఉన్నాయని రెండు జ్యోతిర్లింగాల అయస్కాంత శక్తిని ప్రత్యక్షంగా చూపించారు. జ్యోతిర్లింగాల దర్శన కార్యక్రమంలో భారీగా భక్తులు తరలివచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డిదంపతులు, డాక్టర్ సునీత సంపత్ దంపతులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు, మాజీ ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్, పట్టణంలోని మార్వాడి సంఘం ఆర్యవైశ్య వీరసేవ సమాజ ప్రతినిధులు, పలు స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు ముఖ్యంగా మహిళలు, శివ భక్తులు పెద్ద ఎత్తున హాజరై జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు.