నిర్దిష్ట ప్రణాళికతో పోటీపరీక్షకు సిద్ధం కావాలి.. బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి
March 23, 2026
Prajagalam News
తాండూరు:
విద్యార్థులు గురువుల మార్గదర్శనంలో నిర్దిష్ట ప్రణాళిక మరియు సాధనతో పోటీపరీక్షకు సిద్ధం అయి విజయం సాధించాలని
ఆర్ బి ఓ ఎల్ ఎం డి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
స్థానిక సిద్ధార్థ జూనియర్ కళాశాలలో హిందూ ధార్మిక పరిషత్ నిర్వహిస్తున్న ఫ్రీ( EAPCET )కోచింగ్ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..
కేవలం మార్కులే కాదు విషయ పరిజ్ఞానం పెంచుకొని పోటీ పరీక్షలో విజయం సాధించాలని పేర్కొన్నారు. అభ్యాసమే మనిషిని పరిపూర్ణునులుగ మారుస్తుందని విద్యార్ధినీ విద్యార్థులు ఏకాగ్రత తో సాధన చేసి విద్యా రంగంలో ఉన్నత స్థాయి కి చేరుకోవాలని ఆకాంక్షించారు.గత సంవత్సరం తాండూర్ లో మొదటి సారిగా హిందూ ధార్మిక పరిషత్ శిక్షణ నిర్వహించి అనేక విద్యార్థినులకు మంచి ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే టాప్ కాలేజీల్లో సీట్లు సాధించడం సంతోషకరం అన్నారు. ఈ సంవత్సరం కూడా బాలికల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం ఇలాగే మునుముందు ఎన్నో కార్యక్రమలు నిర్వహించడానికి మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు.ముఖ్యంగా మా RBOL నుంచి..అనేక సంవత్సరాలుగా విద్యార్థులకు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తున్నామని ఇక ముందు కూడా అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక పరిషత్ గౌరవ అధ్యక్షులు కరణం పురుషోత్తం రావు, తాండూరు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ జి. నరేందర్, EAPCET కోచింగ్ కన్వీనర్ పర్యాద రామకృష్ణ,హిందూ ధార్మిక పరిషత్ సభ్యులు ఓం ప్రకాష్ సోమాని,వినోద్ జైన్, పటేల్ విజయ్ కుమార్, జయంత్,అధ్యాపకులు,విద్యార్థినులు పాల్గొన్నారు.