schedule Thursday, May 21, 2026

కమీషన్ల కోసం కాంగ్రెస్ కక్కుర్తి

calendar_today March 23, 2026
person Prajagalam News
కమీషన్ల కోసం కాంగ్రెస్ కక్కుర్తి
బీజేపీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు
  • వికారాబాద్ (పరిగి) తెలంగాణను భ్రష్టు పట్టిస్తూ, కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్న రేవంత్ సర్కార్‌కు చరమగీతం పాడే వరకు మా పోరాటం ఆగదని వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపు మేరకు చేపట్టిన "అసెంబ్లీ ముట్టడి" కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీని ముట్టడించిన వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కల్లబొల్లి మాటలు చెప్పి నేడు రైతులను, నిరుద్యోగులకు, మహిళలను, ప్రజలను, నిండ ముంచిందని అన్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన 420 హామీలను అములు చేయాలని లేనిచో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను,ప్రజాప్రతినిధులు అడ్డుకుంటామని హెచ్చరించారు. సామాన్యుడి బతుకును ఆగం చేస్తున్న ఈ అరాచక పాలనపై సమరశంఖం పూరిస్తూ.. పేదల గొంతుకై అసెంబ్లీ సాక్షిగా నిరసన తెలియజేయడం జరిగిందన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని అరెస్టులు చేసినా ప్రజా పక్షాన పోరాడే బీజేపీ సైనికులను ఆపడం ఎవరి తరం కాదని అన్నారు. అనంతరం వారిని ముషీరాబాద్ పోలీసు స్టేషన్ కి తరలించారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో బీజేపీ కుల్కచర్ల మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్,గండ్వీడ్ బీజేపీ నాయకుడు ప్రభు నాయక్ పాల్గొన్నారు.