ఈ బడ్జెట్ ఒక అంకెల గారడి
March 23, 2026
Prajagalam News
ముఖ్యమంత్రి,స్పీకర్ జిల్లాకు ప్రత్యక నిధులు తేవాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ తో తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమి లేదని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కుమ్మరిపల్లి గోపాల్ ముదిరాజ్ అన్నారు.గత 3 రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. దీని పై సోమవారం వికారాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒకలా వ్యవహరిస్తుందన్నారు.ఆరు గ్యారంటీల పేరిట ప్రజల ఓట్లను దండుకొని ఇప్పుడు మోసం చేసిందన్నారు. 6 గ్యారంటీలను ప్రజలకు బాండ్ల ద్వారా పంచి అమలు మాత్రం మర్చిపోయిందన్నారు.ఇందులో మొదటిది మహాలక్ష్మి పథకం అని పెట్టి ప్రతి మహిళలకు రూ.2500 ఇస్తామని ఇప్పటికి ఇవ్వకుండా మోసం చేశారన్నారు.గృహ జ్యోతి పథకం అమలు పరిచిన ఈ పథకం పై బడ్జెట్ లో స్పష్టత లేదని అన్నారు.ఇందిరమ్మ ఇండ్లు అంటూ పేదలకు ఇస్తూనే వాటిపై ఆంక్షలు పెట్టి ఇప్పుడు అర్హులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు.అలాగే యువకులకు యువ వికాసం పెట్టి యువతకు ఉద్యోగాలు ఈ బడ్జెట్ లో ఆ ఊసు లేదని మండిపడ్డారు.చేయూత అని పెట్టి పింఛన్ ను డబుల్ చేస్తామని చెప్పి ఇప్పటికి ఆ విషయం ప్రభుత్వానికి గుర్తు రావడం లేదని అన్నారు.ఈ ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి వాటిని ఈ బడ్జెట్ లో చేర్చకపోవడం దారుణమని అన్నారు.దీనితో పాటు వికారాబాద్ జిల్లాకు ఈ బడ్జెట్ లో ఎం లాభం చేశారని అడిగారు. జిల్లాకు చేసిందంతా గత ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాత్రమే అని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లాకు ప్రత్యేక నిధులు తేవడం లేదని,వికారాబాద్ ప్రజలు ఒక సారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.తాము ఎప్పుడు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ మున్సిపల్ లోని రోడ్లు అభివృద్ధికి ఫండ్ పెట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వేణుగోపాల్,నాయకులు మేక చంద్రశేఖర్ రెడ్డి,సుభాన్ రెడ్డి,మల్లికార్జున్, నవీన్ తదితరులు ఉన్నారు.
- బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కుమ్మరిపల్లి గోపాల్ ముదిరాజ్