నిరంజన్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలి... బీఆర్ఎస్ నాయకులు
March 22, 2026
Prajagalam News
తాండూరు :నిరంజన్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. నిరంజన్ గౌడ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిరంజన్ గౌడ్ మృతి బాధాకరమని ఆయన లేని లోటు తీరనిది అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. నాయకులు బివిజి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ ఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్, కౌన్సిలర్ సురేష్ నాయక్, మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి,రమేష్, హరి గౌడ్ ,చింటూ ,కిషోర్, మన్నరెడ్డి, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.