schedule Thursday, May 21, 2026

రజకులు ఐక్యతతో సంక్షేమ పథకాలను సాధించుకోవాలి... బి ఎస్ ఆర్

calendar_today March 22, 2026
person Prajagalam News
    * రజక సంఘానికి రెండు గుంటల స్వస్థలం కేటాయింపు *నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూర్:తాండూర్ నియోజకవర్గ రజక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) హాజరై నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్బిఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఒక గుంట స్థలం కాకుండా రజక సంఘం కోసం 2 గుంటల తన స్వంత స్థలం కేటాయించామన్నారు. సంఘం అభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా తమ పూర్తి సహకారం ఉంటుందని అన్నారు.రజక సంఘం సభ్యులు ఐక్యంగా ఉండి పని చేయాలని మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట ఇచ్చిన ప్రకారం ఒక గుంట కాకుండా రెండు గంటల స్థలాన్ని కేటాయించిన శ్రీనివాస్ రెడ్డికి రజక సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.