ఇంటింటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
March 21, 2026
Prajagalam News
తాండూర్: రంజాన్ పర్వదినం సందర్భంగా తాండూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుల ఆహ్వానం మేరకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఇంటికి వెళ్ళి రంజాన్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నరసింహులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.