schedule Thursday, May 21, 2026

జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించండి... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి *ఎమ్మెల్యేను కలిసిన దేవాలయ కార్యవర్గ సభ్యులు

calendar_today March 20, 2026
person Prajagalam News
జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించండి... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి *ఎమ్మెల్యేను కలిసిన దేవాలయ నూతన కార్యవర్గ సభ్యులు తాండూర్: శ్రీ భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూర్ కు విచ్చేసిన ఎమ్మెల్యేను జాతర ఉత్సవ నూతన కమిటీ సభ్యులు కలిసి శాలువా పూల మాళలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ప్రసిద్ధిగాంచిన భద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా సమీప కర్ణాటక రాష్ట్రం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని వారికి ఎలాంటి లోటుపాట్లు కలగకుండా సౌకర్యాలను కల్పించాలని అన్నారు. స్వామి వారికి సేవ చేసే అవకాశం మీకు లభించిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షులు మేడి మహేష్, కమిటీ సభ్యులు దేవనూర్ శంకర్, శ్రావణ్ కుమార్, గాజుల విజయ్, శెట్టి చంద్రకాంత్, మద్రిక చంద్రకాంత్, కోర్వార్ అంజలి, అగ్గునూరు సంకేత్ లు పాల్గొన్నారు.