schedule Thursday, May 21, 2026

మహిళ రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి

calendar_today May 17, 2026
person Prajagalam News
మహిళ రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి
  జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోటపల్లి సంతోష రాజు వికారాబాద్ జిల్లా:- మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఈ బిల్లు ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోటపల్లి సంతోష రాజు అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అతిధి గృహంలో "పోస్టు కార్డులపై మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ" కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....మహిళ బిల్లును వెంటనే అమలు చేయాలని,చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లు పై దృష్టి పెట్టాలని అన్నారు.ఈ బిల్లు అమలు జరిగితే మహిళ లోకం దేశాన్ని శాసించే స్థాయికి వెళ్తుందన్నారు.కాంగ్రేస్ పార్టీ జాతీయ మహిళ అధ్యక్షురాలు ఆల్కలంభ,రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు స్వర్ణక్క ఆదేశానుసారం పోస్టు కార్డులపై సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేసి పీఎంఓ కార్యాలయానికి పోస్టు కార్డులను పంపండం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.