కరెంట్ షాక్ తో కాడెద్దు మృతి,విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అన్ని యజమాని ఆవేదన
May 14, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో టాకీ తండా ప్రాంతంలో కరెంటు షాక్ తో కాడెద్దు మృతి,జాదవ్ సంతోష్ కుమార్ తండ్రి మాణిక్ తెలిపిన వివరాల ప్రకారం టాకీ తండా వెనకాల వ్యవసాయ పొలంలో రెండు కాడెద్దులను సాయంత్రం సమయంలో మేత కోసం వదలగా,త్రీఫేస్ విద్యుత్తు ట్రాన్స్ఫారం దిమ్మె కిందికి ఉండడం,డబల్ ఫేస్ వైర్లు పెట్టడం వలన,కాడెద్దు మూతి భాగంలో తగలడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. గత నెలలో ఒక లక్ష 70 వేల రూపాయలకు ఒక జత కాడెద్దులను కొనుగోలు చేశామని, ఒక ఎద్దు మృతి చెందడంతో సుమారు లక్ష రూపాయల వరకు నష్టం జరిగిందని ప్రభుత్వం,నాయకులు మమ్మల్ని ఆదుకోవాలని యజమాని జాదవ్ సంతోష కుమార్ అన్నారు.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని,ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.