కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
May 14, 2026
Prajagalam News
• రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
• కొనుగోలు కేంద్రాలలో రైతుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలి
• ధాన్యాన్ని భద్రపరిచేందుకు తగిన చర్యలు చేపట్టాలి... జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
(తాండూర్)
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.తాండూర్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుచేసిన వరి, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తనిఖీ చేశారు.తాండూర్, యాలాల్ మండలాలలో లక్ష్మినారాయణ పూర్,అగ్గ నూర్, గోనూర్ గ్రామాలలో శ్రీ బాలాజీ రైస్ మిల్లు,వెంకట పద్మావతి రైస్ మిల్లలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి గురువారం సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, లిఫ్టింగ్ తదితర పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.లోడింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, అందుకు అవసరమైన లారీలు, హమాలీలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కాంటా వేసి మిల్లులకు తరలించే చర్యలు చేపట్టాలన్నారు.రైతులు తమ పంటను విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. తేమ శాతం, నాణ్యత ప్రమాణాల పరిశీలనలో పారదర్శకత పాటించాలని సూచించారు.ఈ సందర్బంగా లారిలో లోడింగ్ చేస్తున్న ప్రక్రియ ను దగ్గరుండి పరిశీలించారు.తాండూర్ మండలం లో నిర్వహిస్తున్న మొక్కజొన్న సేకరణ కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.మిగిలి ఉన్న మొక్కజొన్నను వెంటనే సేకరించేలా తగిన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేయాలని, అలాగే సేకరించిన ధాన్యాన్ని కేటాయించిన గోదాములకు తరలించేందుకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారికి కలెక్టర్ ఆదేశించారు.ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని వరి, మొక్కజొన్న నిల్వలో ఎటువంటి నష్టం జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని భద్రపరిచేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ పర్యటనలో డి ఎం సి ఎస్ మోహన్ కృష్ణ ,డి ఎస్ ఓ సుదర్శన్, తహసీల్దార్ లు తారసింగ్,వెంకట స్వామి, డిటి రషీద్, డీసీఎంఎస్ మేనేజర్ సలాం రైతులు పాల్గొన్నారు.