schedule Thursday, May 21, 2026

పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

calendar_today May 13, 2026
person Prajagalam News
పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

*నీట్-యూజీ పరీక్షల్లో అవకతవకలు అత్యంత దురదృష్టకరం

*పేపర్ లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

*ఎయిమ్స్ ఆధ్వర్యంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలి*

*ఆన్‌లైన్ పరీక్ష విధానంపై కేంద్రం ఆలోచన చేయాలి

  ...బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి (తాండూర్ ) దేశవ్యాప్తంగా నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో వెలుగుచూస్తున్న అవకతవకలు, పేపర్ లీకేజీలు, అక్రమాలు అత్యంత ఆందోళనకరమని బీసీ సంఘము జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి చదివి పరీక్షలకు హాజరవుతుంటే, పరీక్షల నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యం మరియు అవినీతి కారణంగా వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దేశంలో విద్యా వ్యవస్థపై, పరీక్షల పారదర్శకతపై విద్యార్థులు మరియు తల్లిదండ్రుల నమ్మకం దెబ్బతింటోందని పేర్కొన్నారు.ప్రత్యేకంగా పేద, మధ్యతరగతి మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కోట్ల రూపాయల కోచింగ్ వ్యవస్థల మధ్య సామాన్య విద్యార్థులు పోటీ పడుతుంటే, పేపర్ లీకేజీలు మరియు అక్రమాలు వారి ఆశలను ఛిద్రము చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షల నిర్వహణను ఎయిమ్స్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని రాజ్ కుమార్ కందుకూరి డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేలా కఠినమైన మరియు విశ్వసనీయమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.గతంలోనే పలువురు నిపుణులు ఆన్‌లైన్ పరీక్ష విధానం అమలు చేయాలని అభిప్రాయపడ్డారని, ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణపై కూడా సీరియస్‌గా ఆలోచించాలని కోరారు.