schedule Thursday, September 03, 2026

కుల్కచర్ల మండలంలో ఘనంగా బిజేపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

calendar_today April 6, 2026
person Prajagalam News
కుల్కచర్ల మండలంలో ఘనంగా బిజేపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 
సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్" అనే మహత్తర సంకల్పంతో,
గ్రామం నుంచి దేశం వరకు ప్రతి భారతీయుడి జీవితంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో అభివృద్ధి, పారదర్శకత,సుస్థిరతకు భారతీయ జనతా పార్టీ పనిచేస్తోందని బిజేపి వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు అన్నారు. సోమవారం కుల్కచర్ల మండల కేంద్రంలో
బిజేపి 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజేపి కార్యలయంలో బిజేపి మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ బిజేపి జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిగా పాల్గొన్న వికారాబాద్ జిల్లా కన్వీనర్ ప్రహ్లాద్ రావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980వ సంవత్సరంలో స్థాపించబడి అంత్యోదయ లక్ష్యంతో ఏకత్మాత మనవవాదం సిద్దాంతంగా పనిచేస్తూ నేడు ప్రపంచంలో అతి పెద్ద పార్టీ గా అవతరించి
భారతదేశాన్ని 12సంవత్సరాలపైగా
పరిపాలన చేస్తూ అవినీతి లేని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేత్రుత్వంలో బీజేపీ మొదటి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్ పాయ్, అభినవ సర్దార్ లాల్ కృష్ణ అద్వానీ స్ఫూర్తితో అంచెలంచలుగా ఎదిగి నేడు అజేయ శక్తిగా నిలిచిన భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యధిక రాష్టాలలో అధికారంలో ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య, చాపల గూడెం సర్పంచ్ కుమ్మరి స్వప్న గోపాల్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కాటన్ పల్లి అంజిలయ్య,మాజీ సర్పంచ్ సౌమ్య రెడ్డి,దిశ కమిటీ మెంబర్ జానకీ రాం,జిల్లా కార్యవర్గ సభ్యుడు గాదె మహిపాల్ ముదిరాజ్,చంద్రలింగం, పాండురంగ చారి,నీరటి కర్ణయ్య,వార్డు సభ్యురాలు ఉత్తరకుమారి, హన్మంత్,గాదె మల్లేష్,చలివేంద్రం మహేష్, రాజు, బైకడి వెంకట్, బీజ్జరం రాంచంద్రయ్య, రాములు,అంజి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.