schedule Thursday, September 03, 2026

విలేమూన్ హైస్కూల్ చౌరస్తాకు అధికారికంగా పేరు ఖరారు

calendar_today September 3, 2026
person Prajagalam News
విలేమూన్ హైస్కూల్ చౌరస్తాకు అధికారికంగా పేరు ఖరారు

• హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ ను సన్మానించిన వీలేమన్ స్కూల్ ప్రతినిధులు

  (తాండూరు) పట్టణంలోని ప్రముఖ విలేమూన్ హైస్కూల్ చౌరస్తాకు విలేమూన్ హైస్కూల్ చౌరస్తా”గా అధికారికంగా పేరు ఖరారు చేస్తూ  తమ పాఠశాల పేరు పెట్టేలా కృషి చేసిన వార్డు నంబర్‌ 7 కౌన్సిలర్‌ ఇర్షాద్‌ను విలేమూన్ హైస్కూల్ యాజమాన్యం, సిబ్బంది ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల పేరుతో చౌరస్తా గుర్తింపు పొందడం పట్ల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న కౌన్సిలర్‌ ఇర్షాద్‌ను  అభినందించారు.