September 3, 2026
Prajagalam News
రాకేష్ స్వామికి అరుదైన గౌరవం.. డాక్టరేట్ అవార్డు ప్రదానం
తాండూర్:
తాండూర్ కు చెందిన ఆధ్యాత్మిక గురువు రాకేష్ స్వామికి అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్ అవార్డును ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా రాకేష్ గురూజీ మాట్లాడుతూ తనకు లభించిన డాక్టరేట్‌ను వ్యక్తిగత గౌరవంగా కాకుండా అమ్మవారి ఆశీస్సులుగా భావిస్తున్నానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మికతతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కూడా ఆధ్యాత్మిక సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని రాకేష్ తెలిపారు.హోసూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆధ్యాత్మిక రంగానికి చెందిన ప్రతినిధులు, అభిమానులు పాల్గొని రాకేష్ గురూజీకి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.