సత్య భారతి ఫంక్షన్ హాల్ తో తీవ్ర ఇబ్బందులు
September 2, 2026
Prajagalam News
⇒ఆవేదన వ్యక్తం చేసిన 24వ వార్డు ప్రజలు
- Vikarabad :-వికారాబాద్ పట్టణంలో సత్య భారతి ఫంక్షన్ హాల్ వల్ల 24వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.... ఇండ్ల మధ్యలో ఉన్న ఫంక్షన్ హాల్ వల్ల రాత్రిళ్లు,పగలు నిద్ర లేకుండా పోతుందని,ఫంక్షన్ హాల్ లో డీజే మోతలతో హార్ట్ పేషేంట్స్,చిన్న పిల్లలు భయాందోళనకు గురి అవుతున్నట్లు చెప్పారు.అలాగే ఫంక్షన్ హాల్ కు పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్ల పైన,ఇండ్ల ముందు వాహనాలు పార్క్ చేయడం వల్ల కాలనీ వాసులు బయటకు రాలేని పరిస్థితి నెలకొందని తెలియజేశారు.అలాగే చెత్త చెదారం ఫంక్షన్ హాల్ బయట పారవేయడం వల్ల వీధి కుక్కలు స్వైర్య విహారం చేస్తూ... చిన్నారులు,బాట సారులపై దాడులకు(కరవడం) దిగుతున్నాయని అన్నారు.అలాగే ఈగలు ,దోమలు ఎక్కువై చుట్టూ పక్కల ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు.ఇండ్ల మధ్యలో ఉన్న ఫంక్షన్ హాల్ పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో 24వ వార్డు కాలనీ వాసులు ఉన్నారు.