schedule Thursday, September 03, 2026

2నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి

calendar_today September 3, 2026
person Prajagalam News
2నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
  ⇒మున్సిపల్ కార్మికుల నిరసన
  • Vikarabad -:మున్సిపల్ కార్మికులకు 2 నెలల నుంచి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని,వారికి రావాల్సిన జీతాలను వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మహిపాల్ డిమాండ్ చేశారు.గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ లో పని చేసే కార్మికులు ఉదయం నిరసన కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.మహిపాల్ మాట్లాడుతూ...పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని,అలాగే ప్రతి నెల జీతాల నుంచి కటింగ్ ఆపాలని డిమాండ్ చేశారు.అనారోగ్యంతో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని కోరారు.పెన్షన్ సౌకర్యం కల్పించాలని 1181 జీఓ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు రూ.32 వేలు ఇవ్వాలని చెప్పారు.కార్మికులకు పని భారం తగ్గించి,కార్మికుల సంఖ్య పెంచాలని తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి కి విన్నతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్మికుల అధ్యక్షులు శంకర్,కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.