schedule Thursday, September 03, 2026

బాలికల ఎస్టీ హాస్టల్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకస్మిక తనిఖీ

calendar_today September 3, 2026
person Prajagalam News
బాలికల ఎస్టీ హాస్టల్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకస్మిక తనిఖీ
  ( తాండూర్) తాండూర్ పట్టణంలోని సాయిపూర్ బాలికల ఎస్టీ హాస్టల్‌ను తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి సందర్శించి హాస్టల్‌లోని పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న టిఫిన్, భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించడంతో పాటు హాస్టల్‌లో కల్పించిన వసతులను పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత ఎలా ఉంది, హాస్టల్‌లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, వసతులు ఎలా ఉన్నాయి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని, వారికి నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతులు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని నీరజ బాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పదో వార్డు కౌన్సిలర్  శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.