కుటుంబ సమేతంగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం
calendar_today
November 4, 2026
person
Prajagalam News
(తాండూరు)
తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తిశ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజాసేవకు మరింత శక్తి, సామర్థ్యం లభించాలని ప్రార్థించారు.