చేవెళ్ల బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ తాండూరులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆర్బిఓ ఎల్ సి ఈఓ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ( బి ఎస్ ఆర్ ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి మృతుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి మనోధైర్యం కలగాలని ప్రార్థించారు.ఈ ర్యాలీలో పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, ఆర్ట్ ఆఫ్ లవింగ్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రమాద మృతులకు ఘనంగా నివాళులర్పించారు.