schedule Wednesday, November 04, 2026

రాష్ట్రస్థాయి పోటీలకి ఎంపికైన విద్యార్థి వార్వాళ్ళ అరుణ్ కుమార్ 

calendar_today November 4, 2026
person Prajagalam News
రాష్ట్రస్థాయి పోటీలకి ఎంపికైన విద్యార్థి వార్వాళ్ళ అరుణ్ కుమార్ 
కుల్కచర్ల వికారాబాద్ లోని సెయింట్ జూడ్స్ పాఠశాలలో 30 జట్లతో జరిగిన పీఎం శ్రీ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ముజాహిద్పూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. పాఠశాల విద్యార్థి, కుల్కచర్ల గ్రామానికి చెందిన వార్వాళ్ళ.అరుణ్ కుమార్ (తండ్రి /వార్వాళ్ళ యాదయ్య) కబడ్డీలో రాష్ట్ర స్థాయికి ఎంపికవడంతో పాటు 100 మీటర్ల పరుగు పందెంలో జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నాడు. అదే విధంగా వాలీబాల్లోనూ బాలికల జట్టు జిల్లా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, విజేతలను ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిబా, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఘనంగా అభినందించారు.