schedule Tuesday, November 03, 2026

బిల్లు చెల్లించినా రూ.5 లక్షల జరిమానానా?

calendar_today November 3, 2026
person Prajagalam News
బిల్లు చెల్లించినా రూ.5 లక్షల జరిమానానా?
   

• విద్యుత్ అధికారుల తీరుపై విఠల్ నాయక్ ఆగ్రహం

• సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని విమర్శ

 

(తాండూరు)

విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించినప్పటికీ వినియోగదారులపై రూ.5 లక్షల జరిమానా విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తాండూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అత్యవసర సేవలకు సంబంధించిన విద్యుత్ సరఫరా నిలిపివేసే ముందు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అధికారులు నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించిన వినియోగదారులపై భారీ జరిమానాలు విధించడం సమంజసం కాదని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, జరిమానాల విధింపుపై విచారణ జరిపి  న్యాయం చేయాలని విఠల్ నాయక్ డిమాండ్ చేశారు.