పెన్షన్ కోసం గోస.. 5 కిలోమీటర్లు వెళ్లాల్సిందేనా!.
November 4, 2026
Prajagalam News
ప్రభుత్వం అందిస్తున్న పింఛను సొమ్మును అందుకోవడానికి వృద్ధులు, దివ్యాంగులు పడరాని పాట్లు పడుతున్నారు. పింఛను అందజేయాల్సిన బాధ్యత కలిగిన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వేరే గ్రామాలకు వెళ్లాల్సి వస్తోందని లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి పెద్ద తండాకు చెందిన పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పోస్ట్ మెన్ తండాకు వచ్చి పింఛను సొమ్ము పంపిణీ చేయాలని పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతుందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పింఛను కావాలంటే దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని వృద్ధులు, దివ్యాంగులు వాపోతున్నారు. వయోభారంతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమకు ప్రతి నెలా 5 కిలోమీటర్లు వెళ్లడం ఎంతో కష్టతరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.దాంతో పాటుగా ఎవరైన ఇదేంటి అని పోస్ట్ మెన్ ను ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడతారని,మీకు ఇష్టం వచ్చిన వారికి ఫిర్యాదు చేసుకోండి అంటూ నిర్లక్యంగా మాట్లాడతారని పలువురు ఆరోపిస్తున్నారు.అధికారులు వెంటనే స్పందించి పోస్ట్ మెన్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, పింఛను సొమ్మును నేరుగా తండాలోనే పంపిణీ చేసేలా చర్యలు చేపట్టి తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని పెద్ద తండా వాసులు డిమాండ్ చేస్తున్నారు.
మాకు పోవడానికి ఇబ్బందిగా ఉంది...
...నేనావత్ వర్ష నాయక్. పెన్షన్ దారు.
పెన్షన్ కోసం తండా నుండి కిష్టాపూర్ పోవాలి.మాకు బస్సు సౌకర్యం కూడా సరిగా ఉండదు. మాకు ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదు.చాలా ఇబ్బందిగా ఉంది.ఇక్కడకు వచ్చి పెన్షన్ ఇస్తే బాగుంటది.
అధికారులకు విన్నవించాం...సర్పంచ్ సురేఖ రవి.
పెన్షన్ దారులకు కలుగుతున్న ఇబ్బంది పట్ల పలువురు అధికారులకు విన్నవించాం.మండల స్థాయిలో ఎంపీడీవో తో పాటు గా జిల్లా స్థాయిలో కలెక్టర్ కు కూడా వినతి పత్రం అందజేశాం.. అయినా ఇప్పటివరకు స్పందన లేదు.అధికారులు త్వరగా సమస్య
పరిష్కరించేలా చూడాలి.