schedule Wednesday, September 02, 2026

కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ భరోసా

calendar_today September 2, 2026
person Prajagalam News
కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ భరోసా

• 261 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు

• రూ.1.50 కోట్లకు పైగా ఆర్థిక సహాయం

• .ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

  (తాండూరు) అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి  అండగా నిలుస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  అన్నారు. తాండూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 261 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1.50 కోట్ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో అనుకోకుండా ఎదురయ్యే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఆర్థికంగా తీవ్ర భారాన్ని మోపుతాయని అన్నారు. వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని తెలిపారు.261 కుటుంబాలకు రూ.1.50 కోట్ల సాయం అందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన కుటుంబాలు  ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ ఖాసీం అలీ, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజ్, 4 మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.