schedule Wednesday, September 02, 2026

ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం

calendar_today September 2, 2026
person Prajagalam News
ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం
  వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య
  • Vikarabad:- కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసి పేదల కల సాకారం చేస్తుందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య అన్నారు.బుధవారం వికారాబాద్ మున్సిపల్ లోని వార్డ్ నెంబర్ 11 జాంబాపూర్ తండా లో ఇందిరమ్మ ఇళ్ళను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య మాట్లాడుతూ...దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లను నిరుపేద ఇల్లు లేని కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉంటుందని,రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన ఇండ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి వార్డులో ఇండ్ల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయని అన్నారు.తెలంగాణ శాసనసభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో మన నియోజకవర్గానికి అదేవిధంగా ప్రత్యేకంగా వికారాబాద్ మున్సిపాలిటీకి ఎక్కువ ఇండ్లను కేటాయించడం ద్వారా నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య విచ్చేసి నూతన వస్త్రాలు అందించి గృహప్రవేశం చేయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మరియు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ కు ఎల్లప్పుడు అండగా ఉంటామని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గురిబాయి బాబునాయక్,మాజీ ఏ ఎం సి మాజీ చైర్మన్ రాంచంద్రరెడ్డి,కౌన్సిలర్లు మల్లికార్జున గౌడ్, రాఘవేందర్, రామకృష్ణ రెడ్డి,రాకేష్,నాయకులు శ్రీకాంత్, నాగరాజు, లాలయ్య, శేఖర్,నరేందర్ తదితరులు పాల్గొన్నారు