చండీయాగంలో పాల్గొన్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
August 20, 2026
Prajagalam News
Vikarabad -:
లోక కళ్యాణం కోసం జరుగుతున్న చండీయాగంలో పాల్గొనడం నా అదృష్టం అని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.కూకట్ పల్లి ప్రగతినగర్‌లోని హెచ్‌ఎంటీ హిల్స్ కాలనీలో ఆరా ల్యాబ్స్ వి. చంద్రశేఖర శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన చండీయాగంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.ప్రజాప్రతినిధులు, నాయకులు, పండితులు, పూజారులు, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.ఈసందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ..లోక కళ్యాణం కోసం జరుగుతున్న చండీయాగంలో పాల్గొనడం నా అదృష్టం. దేశంలో, రాష్ట్రంలో ఎలినినో ప్రభావం పూర్తిగా తగ్గిపోయి కరువు పరిస్థితులు తొలగిపోయి, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మొక్కుకున్నారు.