దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ
August 17, 2026
Prajagalam News
⇒హల్ద్వానీ ఘటన విచారకరం
⇒ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధారసింగ్
- Vikarabad -:దళితులను బిజెపి పార్టీ అనునిత్యం అవమానాలకు గురిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నారు. హల్ద్వానీ ఘటనను నిరసిస్తూ, ఏఐసీసీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా నుండి డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు భారీ మార్చ్ మరియు అనంతరం సత్యాగ్రహ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.... హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న సభా ప్రాంగణాన్ని బీజేపీ వారు “శుద్ధీకరణ” పేరుతో అవమానించడం అత్యంత ఖండనీయమని అన్నారు.ఇది అపవిత్రం అయ్యిందని అదే ప్రదేశంలో హోమం నిర్వహించడం ఎంతవరకు సమంజసం అన్నారు.స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న బీజేపీ పాలిస్తున్న 13 సంవత్సరాలో ఇలాంటి చర్యలు చేయడం హేయమైన పద్ధతి,ఎప్పుడు కూడా హిందువులం అంటూ చెప్పుకునే బీజేపీ దళితులు సమావేశం నిర్వహించుకున్న ప్రదేశాన్ని శుద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు.మతాలను విడదీసి హిందు రాజ్యం తెస్తామని అనుకుంటున్నారని,కానీ అన్ని పార్టీలలో హిందు దేవులను పూజించే వారు ఉన్నారని చెప్పారు.కానీ బీజేపీ మాత్రం హిందు హిందు అంటూ రాముని పేరు చెప్పుకుని దోచుకుంటున్నారని అన్నారు.దళితులను అవమాణిస్తే సహించేది లేదని అన్నారు.ఇలాంటి ఘటనలు భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావం మరియు మానవ గౌరవం అనే విలువలకు విరుద్ధమని తెలిపారు.అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన సత్యాగ్రహంలో రాజ్యాంగ పరిరక్షణకు, వివక్ష నిర్మూలనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి, మండల & టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు, అనుబంధ సంఘాలు, విభాగాలు, సెల్స్, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.