సర్పంచ్, సెక్రటరీల మధ్య వివాదం
August 16, 2026
Prajagalam News
⇒ఇరువర్గాలపై కేసులు నమోదు
⇒వివరాలు వెల్లడించిన ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్
Vikarabad-:(ప్రజాగళం):వికారాబాద్ జిల్లా
పెద్దేముల్ మండల పరిధిలోని కందెనెల్లి తండా సర్పంచ్ రాథోడ్ ఆనంద్ నాయక్, ఆయన కుమారుడు నితీష్,పంచాయతీ సెక్రటరీల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది.స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విధి నిర్వహణ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అనంతరం పరస్పరం దాడులకు పాల్పడినట్లు సమాచారం.ఘటన అనంతరం ఇరువర్గాలు అదే రోజు పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పంచాయతీ సెక్రటరీ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందెనెల్లి తండా సర్పంచ్ ఆనంద్ నాయక్, ఆయన కుమారుడు నితీష్ కుమార్‌లపై పోలీసులు క్రైమ్ నెంబర్ 152/2026 లో 121(1), 132, 351(2) రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ ల కిందా కేసు నమోదు చేసినట్లు పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.అదేవిధంగా సర్పంచ్ ఆనంద్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచాయతీ సెక్రటరీలు మల్లేశం, కే.నవితలపై కూడా క్రైమ్ నెంబర్ 153/2026 లో
118(1), 351(2), 352 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ ల కిందా కేసు నమోదు చేసినట్లు పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.ఇరువర్గాల ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.ఘర్షణకు దారితీసిన కారణాలు, ఘటనలో ఎవరి పాత్ర ఎంతమేర ఉందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు