గాంధీభవన్‌లో సమావేశమైన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ
August 16, 2026
Prajagalam News
Vikarabad:- వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఆదివారం గాంధీభవన్‌లో డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో వికారాబాద్ డీసీసీకి సంబంధించిన పలు కీలక అంశాలు, జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూర్ బుయ్యని మనోహర్ రెడ్డి, ఎఐసిసి యువజన కాంగ్రెస్ నాయకుడు కోలుకుంద సంతోష్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్లు నీరజ బాల్ రెడ్డి, గడ్డం అనన్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కోటపల్లి సంతోష, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, మైనారిటీ సెల్ చైర్మన్ ఖాజా ఆమీర్ ఎస్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ శివరామ్ నాయక్, ఎస్టి సెల్ జిల్లా ప్రెసిడెంట్ కోటపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.