80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు
August 15, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం,మండల ప్రజా పరిషత్ కార్యాలయం,మహిళా సహాయక పరస్పర సంస్ధ కార్యాలయం,వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో,పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు.జాతీయ జెండాను ఆవిష్కరించి,జాతీయ గీతం ఆలపించి,దేశభక్తి,అభివృద్ధి,విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో,మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.ఆనాటి మహనీయుల త్యాగాలు నేటి స్వాతంత్ర దినోత్సవం పండుగను మన దేశంలో జరుపుకుంటున్నామని తహాశీల్దార్ షాహిదా బేగం తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్,జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు జానకి,ఎంపీడీవో సంపత్ కుమార్,మండల విద్యాధికారి డి.రాములు,ఏపీఎం పద్మారావు,పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి,వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,మార్కెట్ కమిటీ చైర్మన్ జి.మాధవ రెడ్డి,మండల నాయకులు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.