schedule Thursday, September 03, 2026

ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగరాలి

calendar_today August 10, 2026
person Prajagalam News
ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగరాలి
⇒ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ "డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి" వికారాబాద్ జిల్లా-: భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, రాష్ట్ర పార్టీ సూచనలతో నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కెఆర్ఆర్ హాస్పిటల్‌ పై సోమవారం జాతీయ జెండాను భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్ "డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి"ఎగురవేశారు.ఈ సందర్భంగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి" మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇంటి సభ్యులందరితో కలిసి జాతీయ జెండా స్ఫూర్తిని పంచుకోవాలని సూచించారు.భారతదేశం ఎన్నో సంవత్సరాల పాటు విదేశీ పాలనలో అనేక కష్టాలను ఎదుర్కొందని, దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. వారి త్యాగాలు, దేశభక్తి, స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్యం మనకు ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగా లభించిందని, ఆ స్వేచ్ఛ విలువను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని "కొప్పుల డాక్టర్ రాజశేఖర్ రెడ్డి" పేర్కొన్నారు.దేశభక్తి భావనను ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా హర్ ఘర్ తిరంగా’కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. జాతీయ జెండా మన ఐక్యతకు, దేశభక్తికి ప్రతీక అని పేర్కొంటూ, రాబోయే స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశభక్తి భావంతో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.