schedule Thursday, September 03, 2026

ఆదివాసీల సంస్కృతి గొప్పది

calendar_today August 9, 2026
person Prajagalam News
ఆదివాసీల సంస్కృతి గొప్పది
- సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి   వికారాబాద్ జిల్లా:ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని వాటిని కాపాడుకుంటూ చదువులో ముందుకు సాగాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, వెంకట్ రాములు అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రం లో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) లంబాడీ హక్కుల సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో గిరిజన వసతి గృహము లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ...విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని అందుకు అందరు చదవాలని, ఉద్యోగ అవకాశలను సద్వినియోగం చేసుకొని మంచి స్థానాలలో సమాజాన్ని నిలబెట్టాలని సూచించచారు.ఐక్యరాజ్య సమితి 1994 నుండి ఆదివాసీల అభివృద్ధి, భాష సంస్కృతి కి పరిరక్షణ కు తోడుపడేలా అన్ని దేశాల ప్రభుత్వాలు కృషి చేయాలనీ పిలుపునిచ్చిందని తెలిపారు. 75 ఏండ్ల స్వాతంత్ర భారత దేశంలో నేటికీ ఆదివాసీల జీవన ప్రమాణాలు, విద్యా వైద్యం, కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం లోని బీజేపీ అధికారం లోకి వచ్చాక భారత రాజ్యాంగం 5 వ షెడ్యూల్ లో కల్పించిన హక్కులు, చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా విధానాలను ఆవలంబిస్తుందని విమర్శించారు. ఆదివాసీలకు ఆస్తిత్వం లాంటి 1/70 చట్టం నేడు ప్రమాదం లో ఉన్నదని దాన్ని కాపాడేందుకు, జీఓ 3 పునరుద్దరణ కై ఆదివాసీ యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాతం లో అన్ని గ్రామాలకు రోడ్డులు, మంచినీరు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, జిల్లా నాయకులు విజయ, రాజు రామచంద్ర నాయక్ కిషన్ శ్రవణ్ గోపాల్ గిరిజన విద్యార్థి నులు పాల్గొన్నారు పాల్గొన్నారు