మట్టి నమూనా పరీక్ష నిర్వహించిన వ్యవసాయ అధికారులు
August 8, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో విద్యార్థినిలతో మట్టి నమూనా పరీక్ష నిర్వహించిన వ్యవసాయ అధికారులు రాజేంద్రనగర్ మట్టి పరీక్షా ప్రయోగశాల వ్యవసాయ అధికారి నుస్రత్,అరుణ నిర్వహించారు.ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ మట్టి పరీక్షల ప్రయోజనాలు,సమతుల్య ఎరువుల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో మట్టి సంరక్షణ శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందేలా సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనిత,పాఠశాల ప్రధానోపాధ్యాయులు హిర్యా నాయక్,వ్యవసాయ విస్తరణ అధికారులు నవీన్, ఐజాక్ హెరాల్డ్,సైన్స్ ఉపాధ్యాయులు శ్రామణి, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.