బీసీ,ఎస్సి,ఎస్టీలకు రాజ్యాధికారం రావాలి
August 5, 2026
Prajagalam News
బలహీన వర్గాలను పీక్కు తినేది రెడ్డిలే
-బీసీ,ఎస్సీ,ఎస్టీ జెఏసి చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్
Vikarabad:-
బీసీ,ఎస్సీ,ఎస్టీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే బీసీ, ఎస్సీ,ఎస్టీల బ్రతుకులు మారుతాయని, రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ,ఎస్సీ ఎస్టీలను పీక్కు తినేది రెడ్డిలేనని బీసీ,ఎస్సీ,ఎస్టీ జెఏసి చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లిలో ఉన్న చాయ బంక్వెట్ హాల్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభ నిర్వహించగా ఆ సభకు ముఖ్యఅతిథిగా ఆ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వికారాబాద్ అంటేనే ఎత్తైన కొండలు, చల్లని వాతావరణం పచ్చని చెట్లుతో స్వర్గంలో ఉంటుందన్నారు. ఈ పచ్చని కొండల్లో పక్షులు, కుందేలు, జింకలు ఉంటాయని వీటితో పాటుగా వన్యమృగాలు కూడా ఉంటాయన్నారు. జిల్లాలో అమాయక ప్రజలు ఉన్నారని, అవసరమైతే ఆత్మహత్యలు చేసుకుంటారు తప్ప గౌరవంతో బతుకుతారని చెప్పారు. ఇక్కడ మంచి మనుషుల మధ్య మానవ మృగాలు ఉన్నాయని, జిల్లాలో లక్షల్లో ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీలను పిక్కుతినే రెడ్డిలు ఉన్నారని,ఆటవిక మృగాలే ఈ రెడ్డిలు అని అన్నారు. ఎన్నో ఏళ్లుగా బీసీ, ఎస్సీ,ఎస్టీలను దోపిడీకి గురిచేస్తుంది కూడా ఈ రెడ్డి సామాజిక వర్గమే అని నొక్కి చెప్పారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు శత్రువు ఎవరో స్పష్టంగా చూడడం మన తాతలకు, తండ్రులకు తెలియలేదని కనీసం మన తరాలకు శత్రువు ఎవరో చెప్పేందుకే తాను వికారాబాద్ వచ్చారని విశారదన్ మహారాజు తెలియజేశారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరు ఉన్న రెడ్డిలకు బానిసలుగా ఉండాల్సిందేనని,సీఎం రేవంత్ రెడ్డి కెసిఆర్ కంటే అబద్ధాలు చెప్పి గెలిచి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారన్నారు. భూ వ్యాపారాలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీసీ ఎస్సీ ఎస్టీలు ఎలా యుద్ధం చేస్తారని,ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో దోపిడీ చేస్తుంది కేవలం రెడ్డి సామాజిక వర్గమే అన్నారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల ఎస్ బి సి,ఎస్ సి,ఎస్ టి లకు యుద్ధతంత్రము తెలియాలన్నారు. ఈ సామాజిక వర్గాల కోసం తెలంగాణ గడ్డపై బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పుట్టిందని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఏన్నో ఉద్యమాలు,పార్టీలు రెడ్ల నాయకత్వాన్ని కొంచెం కూడా కదుప లేకపోయిందని,అందుకే రెడ్లను దించేందుకే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామాన చూసిన ప్రజలకు ప్రధాన శత్రువు రెడ్డి,వెలమ రూపంలో ఉన్నారని తెలియజేశారు.రెడ్ల చేతుల్లోనే భూములు, సంపద ఉందని,మరి 90శాతం ఉన్న బీసీ,ఎస్సి,ఎస్టీలకు ప్రాతినిధ్యం ఎక్కడుందని ప్రశ్నించారు.మన వర్గాల్లో ఇంకా బానిసత్వం నడుస్తుందని, 10 ఓట్లు లేని రెడ్లు రాజకీయం చేయడానికి వీడేవడని,అంత వారే ఉంటే మా నాయకుడు ఎక్కడ అని ప్రశ్నించారు.అప్పట్లోనే పూలే ,సాహు మహరాజ్ వంటి వారు పోరాటాలు చేశారు.వారి దారిలో నడిచే వారు మనకు ప్రాతినిధ్యం వహించాలని అన్నారు. బీసీ,ఎస్టి,ఎస్సి ల కోసం మాట్లాడడానికి ,కొట్లాడతానికి బీసీ,ఎస్టీ,ఎస్సీలకు కన్నతలై ఈ జెఏసి ఆవిర్భావం జరిగిందన్నారు.ప్రతి పక్ష నాయకుడు ఇంట్లో పండుకోవడం ఏంటని,ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ పొందుతూ విలాసంగా ఉంటూ ప్రజల కొరకు ప్రశ్నించక పోవడం దుర్మార్గం అని అన్నారు.తెలంగాణలో గత,ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు భూస్వామ్య రెడ్డి,వెలుమలే ఉన్నారన్నారు.అన్ని పార్టీలతో ఆ రెడ్లేనని, ఏ గ్రామానికి పోయిన వారే గ్రామాన్ని మింగుతున్నారని ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలలో విప్లవము రావాలని,4 కోట్ల మంది బీసీ ఎస్సీ,ఎస్టీలను మనమే ఆర్గనైజ్ చేసుకోవాలన్నారు. తెలంగాణ గడ్డపై పునర్నిర్మాణం చేసేందుకు జేఏసీ వచ్చిందని, నాయకత్వం కురుమరుగైతే రెడ్డి గారే దోచుకుంటారన్నారు.
జిలాల్లోని కళ్లపూర్ గ్రామంలోని బీసీ ఎస్టీ ఎస్సీల భూములను దోచుకునేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారని, బీసీ ఎస్సీ ఎస్టీల వద్ద భూములు లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఫ్యాక్టరీలు పెడితే, భూములను అమ్మితే రేవంత్ సర్కార్ కి లాభం వస్తుందని సీఎం ఆలోచన చేస్తున్నట్లు ఉన్నారన్నారు.బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని,అలాగే అన్ని రంగంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డపై సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధనకై జేఏసీ యుద్ధం చేస్తుందన్నారు. తెలంగాణ గడ్డపై బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జెండా పాతుతామని, రాబోయే ఎన్నికల్లో ఓట్లను అమ్ముకోకుండా చూడాలని, ఓట్లను కొనేందుకు వచ్చిన వారిని తరిమి కొడతామని హెచ్చరించారు.రెడ్ల వ్యవస్థను కూల్చి అలంకరణ వర్గాలను సింహాసనంపై కూర్చోబెట్టడమే తన ఆకాంక్ష అన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమన్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రాఘవేందర్ ముదిరాజ్, డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్, జిల్లా అధ్యక్షులు రవీందర్ మహారాజ్, జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్ ,బంట్వారం మాజీ జడ్పిటిసి సంతోష రాజు,మేధావులు,విద్యావంతులు ఉన్నారు.