బీఆర్ఎస్ నిర్లక్ష్యమే పెండింగ్ లో అభివృద్ధి పనులు
August 5, 2026
Prajagalam News
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్
- వికారాబాద్-: గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే నేడు అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిందని వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ సహాయ సహకారాలతో గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తిచేసే విధంగా ఒక కార్యచరణ తో పాలకమండలి ముందుకు వెళ్తున్నామని, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్ ను కడతామని చెప్పి అక్కడ ఉన్నటువంటి షెడ్డులను, మరుగుదొడ్లను, నీటికీ సంబంధించిన కుళాయిలను పూర్తిగా ధ్వంసం చేసి రైతులను మోసగించారని నిర్మాణం మొదటి దశలోనే ఇంటిగ్రెటెడ్ మార్కెట్ బిల్డింగ్ పనులు ఆగిపోయిందని అన్నారు.అప్పటినుంచి అక్కడ రైతులు కనీస వసతులు లేక గత ప్రభుత్వంలోవసతులు లెక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు .అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గడ్డం. ప్రసాద్ కుమార్ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్, నూతన మరుగుదొడ్లు, బోర్ వెల్, కూరగాయలు అమ్ముకునేందుకు వీలుగా కొత్త కవర్ షెడ్డు పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించామని అవి టెండర్ దశలో ఉన్నాయని అతి త్వరలో ఈ పనులన్నీ పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని, అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అవకులు చాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజల్లో అభివృద్ధి నిరోధకలుగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మిగిలిపోయారని అభివృద్ధి కారకులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ మరియు వైస్ చైర్మన్ మల్లేశం తెలియజేశారు.