schedule Thursday, September 03, 2026

ఘనంగా ఆషాడ మాసం అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు

calendar_today August 4, 2026
person Prajagalam News
ఘనంగా ఆషాడ మాసం అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో మంగళ వారం నాడు శ్రీ మైసమ్మ దేవతకు భక్తులు బోనాలు సమర్పించడం జరిగింది. అమ్మవారికి బోనాలు తీసి, దీప,ధూప,నైవేద్యం,కళ్ళు సాకలు,డప్పుల దరువులతో శ్రీ మైసమ్మ అమ్మవారి ఘనంగా మొక్కులు చెల్లించుకున్నారు.గ్రామ ప్రజలను,పిల్లా పాపాలను సుఖ సంతోషాలతో ఉండాలని,వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని భగవంతుని కోరుకున్నట్లు భక్తులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కడమంచి వీరేశం,వానరాశి రమేష్,బైల్పాటి తుల్జారాం,వానరాశి మహేష్,వానరాశి లక్ష్మణ్, భక్తులు,తదితరులు పాల్గొన్నారు.