schedule Thursday, September 03, 2026

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం

calendar_today August 2, 2026
person Prajagalam News
కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధారసింగ్
  • వికారాబాద్ జిల్లా-:
  • కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని,కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా ప్రతి కార్యకర్త పని చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధారసింగ్ అన్నారు.ఆదివారం వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఏఐసీసీ పిలుపు మేరకు సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం చేపట్టారు.ఈ సమావేశంలో 5 అంశాలపై మాట్లాడటం జరిగింది.అందులో కార్యవర్గ పరిచయం,పార్టీ బలోపేతంలో భాగంగా బూత్ కమిటీ,గ్రామ కమిటీ,మండల కమిటీలను వేయాలి.జిల్లా కమిటీ లోని సభ్యులను ఆయా మండలాలకు ఇంచార్జిలను వేశారు.కాంగ్రెస్ పార్టీ అనుబంధం అయినా ఎన్ఎస్ యూ ఐ,ఎస్సి, ఎస్టీ,బీసీ,మైనార్టీ కమిటీలను బూత్ లెవల్ నుంచి బలోపేతం చేయడం.కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ను పటిష్ట పరచడం వంటి అంశాల గురుంచి మాట్లాడారు.
  • ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధారసింగ్ మాట్లాడుతూ...త్వరలో వచ్చే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని,గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ఓటు హక్కును కల్పించేలా పార్టీ నాయకులు పని చేయాలని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్,జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే,రాహుల్ గాంధీ,తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నాయకత్వం ను బలపర్చాలని కోరారు.దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారని చెప్పారు.ప్రతి పక్షాలు కాంగ్రెస్ పార్టీ ఎం చేస్తుందని అంటున్న వారిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు.దేశంలో ఎవ్వరు చేయని విదంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశారని,గత బీఆర్ఎస్ లక్ష లోపు ఉన్న రైతు రుణమాఫీ చేయలేదని,కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని అన్నారు.గత బీఆర్ ఎస్ రైతు బంధు మాత్రమే ఇచ్చి, సబ్సిడీ లను ఎగకొట్టిందని విమర్శించారు. నేడు రైతులకు సబ్సిడీ కింద డ్రిప్స్,వ్యవసాయ పని ముట్లు అందించడం జరుగుతుందని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళ సంఘాలకు పావల వడ్డీకే రుణాలు,రూ 10 లక్షల రుణాలు,పెట్రోల్ పంపు తదితర వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.ప్రతి పేద వారు గూడు లేకుండా ఉండరాదనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదింటి కల సాకారం చేస్తుందని వివరించారు. గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు వరకు ఉచిత కరెంట్,రూ.10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ కార్డును పెంచడం జరిగిందని చెప్పారు.గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు.ఇందిరాగాంధీ ఎలా ఐతే గరీబి హఠావో అనే నినాదంతో పని చేసిందో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే నినాదంతో పని చేస్తున్నారని అన్నారు.మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారని,దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.