schedule Thursday, September 03, 2026

వేసవిలో నీటి ఎద్దడి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

calendar_today March 21, 2026
person Prajagalam News
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం
  కుల్కచర్ల సర్పంచ్ వార్వాల అంజిలయ్య వికారాబాద్ (కుల్కచర్ల) వేసవి కాలంలో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ వార్వాల అంజిలయ్య అన్నారు. శనివారం కుల్కచర్ల మండల కేంద్రంలోని 2వ,3వ వార్డు లకు సంబంధించిన శ్యావకు చెన్నయ్య ఇంటిదగ్గర వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వార్డు ప్రజలకు నీటి కష్టాలు రాకుండా వార్డు సభ్యులు స్వయంగా పర్యవేక్షించి నూతనంగా సింగల్ ఫేస్ మోటర్ బిగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గాదె లక్ష్మీ,గొల్ల ఉదయ్ కుమార్,బిజేపి జిల్లా కార్యవర్గ సభ్యుడు గాదె మహిపాల్,సీనియర్ నాయకుడు గొల్ల.నారాయణ తదితరులు పాల్గొన్నారు.