ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలి :- కుల్కచర్ల నూతన తహసీల్దార్ పురుషోత్తం
June 16, 2026
Prajagalam News
(ప్రజాగళం, కుల్కచర్ల)
తహసీల్దార్ కార్యాలయంలో సానుకూల వాతావరణం నెలకొల్పుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని తహసీల్దార్ పురుషోత్తం సిబ్బందికి సూచించారు.
కుల్కచర్ల మండల నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన పురుషోత్తంకి డిప్యూటీ తహసిల్దార్ చంద్రశేఖర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్ చారి, తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మండల ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని సిబ్బంది తెలిపారు.