కుల్కచర్ల మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే టిఆర్ఆర్:- కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు
June 16, 2026
Prajagalam News
(ప్రజాగళం, కుల్కచర్ల)
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రానికి బుధవారం పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి రానున్నారని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలియజేశారు.మండల కేంద్రంలోని రైతు వేదికలో పలు గ్రామాలకు చెందిన 46మంది కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు అందజేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.