ఘనంగా వివాహా వార్షికోత్సవ వేడుకలు
June 16, 2026
Prajagalam News
(తాండూరు)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లి రోజు సందర్భంగా నివాసంలో రాజకీయ నేతలు, బందు మిత్రులు, ప్రముఖులు శ్రీనివాస్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. శాలువా, పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు ప్రముఖులు శ్రేయోభిలాషుల మధ్య మొక్కను నాటి వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బుయ్యని శ్రీనివాస్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ తమకు జై వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఏంసి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, పట్టణ అధ్యక్షులు బాతుల నాగు, కౌన్సిలర్లు అల్లిపూర్ శ్రీకాంత్ బంటువేణు, జుంటుపల్లి వెంకట్, ఏం సి డైరెక్టర్ నవాజ్, ఉదయ్ కుమార్ లు , కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు, బంటు మల్లప్ప, పటేల్ కిరణ్, మర్యాద రామకృష్ణ, వికాస్ జోషి, మాజీ కౌన్సిలర్లు వెంకన్న గౌడ్, నాయకులు సాయప్ప, దొరి శెట్టి సత్యమూర్తి, అఖిల్ బాబా, రిపోర్టర్లు దేవుని శంకర్, రమేష్ సింగ్ ఠాకూర్, నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.