schedule Wednesday, June 17, 2026

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఎస్.ఐ కె. విఠల్

calendar_today June 15, 2026
person Prajagalam News
అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఎస్.ఐ కె. విఠల్
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్.ఐ కె.విఠల్ అన్నారు.ఎస్.ఐ కె.విఠల్ తెలిపిన వివరాల ప్రకారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా ఎక్మైయి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి ట్రాక్టర్ నెంబర్ ఎపి 28 డియు 5296,ట్రాలీ నెంబర్ టిఎస్ 34 టిబి 8181,సిద్దిక్ మైముద్దిన్ ట్రాక్టర్ కెఎ 32 టిఎ 5504, ట్రాలీ నెంబర్ ఎపి 28 ఎన్ 2516 ట్రాక్టర్లతో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఎక్మైయి వాగు నుండి ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.అదేవిధంగా యాలాల్ మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన ఎరుపూల శ్రీనివాస్ ట్రాక్టర్ నెంబర్ టిఎస్ 34 టిబి 4992, ట్రాలీ నెంబర్ టిఎస్ 34 టిబి 5002 సోమవారం ఉదయం ప్రభుత్వ అనుమతులు లేకుండా కుప్పన్ కోట్ గ్రామనికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసినట్లు,అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.