schedule Wednesday, June 17, 2026

కుల్కచర్ల నూతన తహసీల్దార్ పురుషోత్తంకు కాంగ్రెస్ నాయకుల ఘన స్వాగతం

calendar_today June 16, 2026
person Prajagalam News
కుల్కచర్ల నూతన తహసీల్దార్ పురుషోత్తంకు కాంగ్రెస్ నాయకుల ఘన స్వాగతం
(ప్రజాగళం, కుల్కచర్ల)
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన పురుషోత్తం ను కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని కోరుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పరిపాలన అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పురుషోత్తం మాట్లాడుతూ... ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి,కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్, కాంగ్రెస్ బ్లాక్ 2 అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్,గిరిజన విభాగం అధ్యక్షుడు రాంచందర్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.