schedule Thursday, September 03, 2026

పదవ తరగతిలో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ.

calendar_today April 30, 2026
person Prajagalam News
పదవ తరగతిలో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ.
పదవ తరగతి పరీక్షల్లో వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని 10 ఉన్నత పాఠశాలల్లోని 490 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 452 మంది విద్యార్థులు పాసై 92.24 శాతం ఉత్తిర్ణత సాధించారు. మండలంలోని 10 పాఠశాలలకు గాను 5 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ పరీక్షా ఫలితాల్లో మండల పరిధిలోని కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని షైక్ ఫారేహిన్ 575 మార్కులతో మండలంలో మొదటి స్థానం సాధించగా దోమ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని జి.ప్రేరణ 556 మార్కులు, కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి రాకేష్ 556 మార్కులతో మండలంలో ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా వీరికి పలువురు అభినందనలు తెలిపారు.