schedule Thursday, September 03, 2026

చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏల్పటి అశోక్ కుమార్ దంపతులకు ఘన సన్మానం

calendar_today March 19, 2026
person Prajagalam News
  • చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏల్పటి అశోక్ కుమార్ దంపతులకు ఘన సన్మానం
వికారాబాద్ జిల్లా-: కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామ శివారులో ఉన్న ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామిని గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏల్పటి అశోక్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ చైర్మన్ కోట్ల మహిపాల్ రెడ్డి,స్థానిక సర్పంచ్ మడుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్ కుమార్ రెడ్డి,ఘణాపూర్ సర్పంచ్ రవిందర్ నాయక్,కమ్మరి చంద్రమోహన్ చారి తదితరులు పాల్గొన్నారు.