schedule Thursday, September 03, 2026

calendar_today March 19, 2026
person Prajagalam News
 18వ వార్డు అభివృద్దే ప్రధాన లక్ష్యం

 వార్డులో పర్యటించిన కౌన్సిలర్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ 

ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా... వార్డు అభివృద్దే ప్రధాన లక్ష్యంగా వికారాబాద్ మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ లో భాగంగా వార్డులోని రిక్షా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని డ్రైనేజ్ మాన్యువల్స్ పరిశీలించాలి. వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య సహకారంతో వార్డులో పారిశుద్ధ్య సమస్యలు, వీధిలైట్ల సమస్యలు ఏమి ఉన్న వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. వేసవికాలం ఉన్నందున తాగినీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వార్డు ప్రజలకు తెలిపారు. రమేష్ కుమార్  వెంట స్థానిక నాయకులు, వార్డు ప్రజలు ఉన్నారు.