schedule Thursday, September 03, 2026

పట్టణంలోని పార్కుల అభివృద్ధికి కృషి... చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి 

calendar_today March 26, 2026
person Prajagalam News
తాండూర్: పట్టణంలోని పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని శాంతినగర్ పార్కును కమిషనర్ మధుసూదన్ రెడ్డితో కలిసి పార్కు అభివృద్ధి, పెయింటింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలో గల పార్కులను దశలవారిగా అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. శాంతినగర్ లో పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత నివ్వాలని ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం మున్సిపల్ జవాన్లు శ్రీను, అశోక్, సాయిప్రసాద్ లు పాల్గొన్నారు.