schedule Friday, September 04, 2026

పెండింగ్ లో ఉన్న 10వేల కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలి*

calendar_today March 26, 2026
person Prajagalam News
పట్టణంలో డిగ్రీ కాలేజీల బంద్ విజయవంతం -- పి.డి.ఎస్.యూ. తాండూర్:తెలంగాణ రాష్ట్రoలో పెండింగ్లో ఉన్న 10వేల కోట్ల స్కాలర్ షిప్పులు, ఫీజు రియంబర్స్ మెంటు నిధులను వెంటనే విడుదల చేయాలి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యూ) జిల్లా అధ్యక్షులు పి. శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులకు రావాల్సిన ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పి.డి.ఎస్.యూ. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీల బందుకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా తాండూర్ డివిజన్ లో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచిపోయిందని, అధికారంలోకి వస్తే విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని , పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేస్తామని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రెగ్యులర్గా నిధులను విడుదల చేస్తామని నమ్మ బలికారని కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుండి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయడానికి మనసు రావడం లేదని అన్నారు . దాదాపు 10వేల కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడిందని తెలిపారు. ఈ నిధుల విడుదలకు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, విద్యాసంస్థల యాజమాన్యాలు దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ కోసం PDSU అనేక ఉద్యమాలు నిర్వహించిందని, జిల్లాల్లో కలెక్టరేట్లను, మంత్రుల ఇండ్లను, హైదరాబాదులో మినిస్టర్ క్వార్టర్ను ముట్టడించిందని, పలు దపాలు ఛలో అసెంబ్లీ నిర్వహించి కేసులను సైతం ఎదుర్కొన్నదని, 2026 జూలై మొదటి వారంలో 72 గంటల పాటు బందు నిర్వహించిందని, ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించి నిర్బంధాన్ని ఎదుర్కొన్నదని ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వానికి చలనం రావడం లేదని ఏద్దేవా చేశారు, ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తూ విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తే రేవంత్ రెడ్డి ని ఎక్కడికక్కడ రోడ్ల మీదకి రాకుండా అడ్డుకుంటామని అన్నారు. ప్రభుత్వం వెంటనే బడ్జెట్లో విద్యారంగానికి, స్కాలర్షిప్లకు అధిక నిధులు కేటాయించాలని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు ఇవ్వాల్సిన 218 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు చిన్న, కిరణ్ పాల్గొన్నారు.