schedule Friday, September 04, 2026

వరి విత్తనాల నమోదు తప్పని సరి

calendar_today September 4, 2026
person Prajagalam News
వరి విత్తనాల నమోదు తప్పని సరి

5శాతం బోనస్ కోసం నమోదు చేసుకోండి

వికారాబాద్ మండల వ్యవసాయాధికారి గోల్కొండ ప్రసన్న లక్ష్మీ

  • Vikarabad :-వరి రైతులు ప్రభుత్వం అందించే బోనస్ పొందేందుకు వరి విత్తనాల నమోదు తప్పని సరి అని వికారాబాద్ మండల వ్యవసాయ అధికారి గోల్కొండ ప్రసన్న లక్ష్మీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వం వరి రైతులను ప్రోత్సహం అందించేందుకు క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తుందన్నారు. వికారాబాద్ మండలంలోని రైతులు ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల వరి విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేసినట్లయితే, 5శాతం బోనస్ పొందేందుకు తమ విత్తన వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం నిర్దేశించిన ఏడు వరి రకాలు ఆర్ఎన్ఆర్ 15048, ఎచ్ఎంటి,బిపిటి5204,డబ్ల్యూ జి ఎల్ 44, జై శ్రీరామ్,కెఎన్ ఎం 1638,కెఎన్ఎం7715 వంటివి డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు సంబంధిత విత్తన డీలర్లను సంప్రదించి తమ విత్తనాల వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.అదేవిధంగా, రైతులు సొంత విత్తనాన్ని వినియోగించినా లేదా పరిశోధనా కేంద్రాల నుండి విత్తనం కొనుగోలు చేసినా, సంబంధిత డిక్లరేషన్‌తో తమ వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈఓ) వద్ద 2026 సెప్టెంబర్ 9వ తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు.సెప్టెంబర్ 9వ తేదీలోగా విత్తనాల నమోదు పూర్తి చేయని రైతులకు 5శాతం బోనస్ ప్రయోజనం అందదని, కాబట్టి రైతులు ఎటువంటి ఆలస్యం చేయకుండా గడువులోగా తమ విత్తనాల నమోదును పూర్తి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రసన్న లక్ష్మీ కోరారు.డీలర్లు కూడా తమ వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించి, గడువులోగా నమోదు పూర్తయ్యేలా సహకరించాలని సూచించారు.